Big Tigers : .ఎనిమిది పెద్దపులుల మధ్య కొమరం భీమ్ జిల్లా వాసుల విలవిల

by Y. Venkata Narasimha Reddy |
Big Tigers : .ఎనిమిది పెద్దపులుల మధ్య కొమరం భీమ్ జిల్లా వాసుల విలవిల
X

దిశ, వెబ్ డెస్క్ : కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా (Komaram Bheem Asifabad) వాసులు పెద్ద పులుల సంచారం మధ్య బిక్కుబిక్కుమంటున్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో కాగజ్‌నగర్‌ కారిడార్‌లో 8 పులుల(Tigers) సంచారిస్తుండగా..ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ పులి వచ్చి మీద పడుతుందోనని జనం పులుల భయంతో వణికిపోతున్నారు. కారిడార్ పరిధిలో వలస వచ్చిన 4 మగ పులులు, 2 ఆడ పులులు సంచరిస్తున్నట్లుగా అటవీ అధికారులు గుర్తించారు. పులుల సంచారంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు నిత్యం ప్రాణభయంతో గడుపుతూ రోజువారి పనులకు, వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నారు. పులుల సంరక్షణకు వాటిని ట్రాక్ చేసేందుకు అధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు, ట్రాకింగ్ కెమెరాల ద్వారా పులుల సంచారంపై నిఘా పెట్టి వేటగాళ్ల బారిన పడకుండా చూస్తున్నారు.

మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్‌, కన్నెర్‌గాం టైగర్‌ జోన్‌లలో నుంచి ప్రాణహిత ద్వారా జిల్లాలోకి ప్రవేశిస్తున్న పులులు కాగజ్‌నగర్‌ అడవుల్లో సంచరిస్తున్నాయి. కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతం తడోబా, ఇంద్రావతి, అభయారణ్యాలకు కారిడార్‌ ఉండడంతో పులులు స్వేచ్ఛగా ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నాయి. దట్టమైన అడవులు, పుష్కలమైన నీటి వనరులు, వణ్యప్రాణులు ఉండడమే కారణంజిల్లాలో ఇద్దరిపై పులి దాడి చేయగా ఓ మహిళ చనిపోయింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనేక పశువులు పులుల దాడులకు గురై మృతి చెందగా మరికొన్ని గాయాలపాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని టైగర్‌ కారిడార్‌గా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై అటవీ అధికారులు నివేదికలు తయారు చేస్తున్నట్లు తెలుస్తున్నది.

ప్రస్తుతం తెలంగాణ పరిధిలో పులుల సంఖ్య 42, చిరుత పులుల సంఖ్య 187గా ఉన్నట్లుగా అటవీ అధికారులు నిర్ధారించారు. అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్టు పులుల ఆవాసానికి అనువుగా ఉండగా 2017లో అక్కడ 8పులులు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 34కు చేరినట్లుగా గుర్తించారు. ఇందులో 15ఆడపులులు, 11మగపులులు, 8పులి పిల్లలు ఉన్నాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిధిలో 8 పులులు సంచరిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed