సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. విజయశాంతి ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Mahesh |   ( Updated:2024-12-25 17:05:05.0  )
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. విజయశాంతి ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వం మధ్య ప్రస్తుతం నెలకొన్న వివాదాల నేపథ్యంలో.. సీఎంతో సినీ ప్రముఖులు రేపు ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం జరగనుండగా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, దిల్ రాజులు పాల్గోన నుండగా.. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంతో.. టాలీవుడ్ సీనియర్ నటి, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఆమె తన ట్వీట్‌లో "తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులను గురువారం నాడు కలుస్తున్న సినిమా పరిశ్రమకు, ప్రభుత్వానికి సమగ్రమైన విశ్లేషణాత్మక చర్చలు జరగాలన్నారు.

అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి విస్పష్టంగా ఇకపై ఉండబోవన్న టికెట్ రేట్ల పెంపు, సంక్రాంతి స్పెషల్ షోల అనుమతిపై మాత్రమే కాక, తెలంగాణ సినిమా, సంస్కృతి, ఆచార విధానాల ఉద్దీపన, చిన్న స్థాయి కళాకారులు, సాంకేతిక నిపుణులు, వారి ఉద్యోగ, నివాస భద్రతలు, జీవన ఆధారాలు, ప్రభుత్వ హామీలు, చిన్న మధ్య స్థాయి బడ్జెట్ చిత్రాల విడుదలకు థియేటర్ల కేటాయింపు, ఇలా అన్నిటిపైనా సమగ్రమైన చర్చ, ప్రకటన కూడా వస్తుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ సర్వత్రా చర్చల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విధానం తప్పక నిర్ణయాత్మకంగా ఉంటదని విశ్వసిద్దాం." అని రాసుకొచ్చారు.

Advertisement

Next Story