- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు 15 రోజుల డెడ్ లైన్
దిశ, వెబ్ డెస్క్: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Directer Ram Gopal Varma)కు ఏపీ ఫైబర్ నెట్(AP Fiber Net) లీగల్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం(YCP Government) రూ. 1. 15 కోట్లు అక్రమంగా చెల్లించిందని నోటీసుల్లో పేర్కొంది. 15 రోజుల్లో మొత్తం చెల్లించాలని, లేనిపక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది.
కాగా గత ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) జీవితం ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీ తెరకెక్కించారు. అయితే ఈ మూవీ థియేటర్స్‌లో విడుదల అయిన వెంటనే ఏపీ ఫైబర్ నెట్‌లో కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీకి ఇవ్వాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ డబ్బులు రామ్ గోపాల్ వర్మకు చెల్లించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీంతో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సీరియస్ అయ్యారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు పలువురికి నోటీసులు జారీ చేశారు. వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించి రూ. 2.15 కోట్లు ఫైబర్ నెట్‌తో ఒప్పందం చేసుకుని రూ. 1.15 కోట్లు చెల్లించారని గుర్తించారు. ఒక్కో వ్యూస్‌కు రూ. 11 వేలు చెల్లించడంపై జీవీ రెడ్డి మండిపడ్డారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు లీగల్ నోటీసులు జారీ చేశారు.