- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala : తిరుమలలో మరోసారి పరకామణి కుంభకోణం రచ్చ
దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala)లో పరకామణి(Parakamani) కుంభకోణం(Scandal) మరోసారి రచ్చ రేపుతోంది. పెద్దజీయర్ మఠం ఉద్యోగి సీవీ.రవికుమార్(CV.Ravi Kumar) పరకామణి నుంచి కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ తరలించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా అతనిపై కేవలం రూ.78 వేల విలువైన డాలర్లు దొరికాయని పోలీసులు కేసు నమోదు చేయడం...అనంతరం విచారణాధికారి అతనితో లోక్ అదాలత్ లో రాజీ పడటాన్ని మరోసారి చర్చనీయాంశమైంది. టీటీడీ సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి(Bhanuprakash Reddy)దీనిపై కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. రవికుమార్ అక్రమాల కేసు తీవ్రతను తగ్గించనందుకు అప్పట్లో తిరుపతిలోని 14 ప్లాట్లను రవికుమార్, ఆయన భార్య రమ్య రవికుమార్ లు టీటీడీకి రాసిచ్చారని భానుప్రకాశ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వీటితో పాటు అతని ఆస్తులను అప్పటి టీటీడీ అధికారులు, పాలకమండలి, పోలీసులు తమ సొంతానికి రాయించుకున్నారని, పోలీసుల ఒత్తిడి వల్లే కేసులో రాజీ అయ్యిందని, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ కమిటీ నియమించాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు అధికారికంగా వినతిపత్రాన్ని సమర్పించారు. తిరుమలలో మంగళవారం జరిగిన టీటీడీ ట్రస్టు బోర్డు సమావేశంలో భాను ప్రకాష్‌రెడ్డి 2023 పరకామణి స్కామ్‌లో సుమారు రూ.100 కోట్ల విలువైన నిధులు, ఆస్తులు స్వాహా చేశారంటూ బోర్డు సభ్యులు, విజిలెన్స్, భద్రతా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆయ కొన్ని పత్రాలను కూడా సమావేశంలో చూపించారు.
తిరుమలలోని పెద్ద జీయంగార్ మఠంలో సీవీ రవికుమార్ గుమస్తాగా పనిచేస్తున్నారు. తిరుమల ఆలయంలో పరకామణి (హుండీ లెక్కింపు) కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న మఠానికి అధీకృత ప్రతినిధిగా పనిచేస్తున్నారు. 2023 ఏప్రిల్ 29న రవికుమార్ తన లోదుస్తులలో విదేశీ కరెన్సీ దాచి దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి దొంగిలించబడిన కరెన్సీని స్వాధీనం చేసుకున్న తరువాత టీటీడీ విజిలెన్స్ తిరుమల I టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో రవికుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2023 మే 30న తిరుమల పోలీసులు తిరుపతిలోని రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
అయితే నిందితుడు రవికుమార్ 2023 మే 19న చెన్నై, తిరుపతిలోని విలువైన తన ఏడు ఆస్తులను టీటీడీ బహుమతిగా ఇచ్చాడు. రవికుమార్ తన ఆస్తులను విరాళంగా ఇచ్చిన తర్వాత.. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ లోక్ అదాలత్‌లో అతడితో రాజీ కుదుర్చుకున్నారు. 2023 సెప్టెంబర్ 9న అతనిపై కేసు కొట్టివేయబడింది’’ అని భాను ప్రకాష్ రెడ్డి చెప్పుకొచ్చారు. దేవస్థానం లా డిపార్ట్మెంట్ ద్వారా ఈ విషయంలో విధానపరంగా ముందుకు వెళ్లకుండా.. విజిలెన్స్ అధికారి నిందితుడితో ఎలా రాజీ కుదుర్చుకుంటారని భాను ప్రకాష్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణ గుమస్తాగా ఉన్న నిందితుడు విదేశీ కరెన్సీ నోట్లతో సహా పలు విలువైన వస్తువులను తరచూ దొంగిలించడం ద్వారా అనేక కోట్ల రూపాయల విలువైన సంపదను కూడబెట్టాడని ప్రశ్నించారు. గత పాలకుల హయాంలో టీటీడీ సీనియర్ అధికారులు, విజిలెన్స్, సెక్యూరిటీ వింగ్ సిబ్బంది, స్థానిక పోలీసుల సహకారంతో రాజీ కుదుర్చుకోవడం ద్వారా అతడు కేసులో నుంచి బయటపడ్డాడని వెల్లడించారు. పరకామణి కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని చైర్మన్ ను కోరారు.