సినిమా స్టైళ్లో కిడ్నాప్‌కు యత్నం.. హీరోలా కాపాడిన ఆటో డ్రైవర్

by Gantepaka Srikanth |
సినిమా స్టైళ్లో కిడ్నాప్‌కు యత్నం.. హీరోలా కాపాడిన ఆటో డ్రైవర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్(Borabanda Police Station) పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలిక(Girl)ను కిడ్నాప్ చేసేందుకు కొందరు గుర్తు తెలియని దుండగులు ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ ఆటో డ్రైవర్(Auto Driver).. చాకచక్యంగా బాలికను కాపాడారు. సదరు దుండగుల దాడిలో ఆటో డ్రైవర్‌‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చేజింగ్ చేసి మరీ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాణాలకు తెగించి బాలికను కాపాడిన ఆటో డ్రైవర్‌ను పోలీసులతో పాటు స్థానికులంతా అభినందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed