- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Formula-Car Race Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో కీలక పరిణామం
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా-ఈ రేస్(Formula-Car Race Case) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు(ACB officials) దాన కిషోర్(Dana Kishore) స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. సుమారు 7 గంటల పాటు ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు. దాన కిషోర్ స్టేట్‌మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్(Arvind Kumar), కేటీఆర్(KTR)లకు ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా.. ఫార్ములా-ఈ రేసింగ్‌కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నిధుల విడుదల, అవినీతి కోణాలపై నమోదు చేసిన కేసులో ఏసీబీ(ACB) దూకుడు పెంచుతోంది.
సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ ఈ కేసులో అప్రూవర్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికారవర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా చూడాలంటూ ఆయన ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. తనకు కావాల్సిన వారి ద్వారా ఆయన ప్రభుత్వంలోని పెద్దలతో రాజీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.