Mary Millben: ప్రధాని మోడీపై యూఎస్ సింగర్ మేరి మిల్‌బెన్ ప్రశంసలు.. కారణమిదే?

by vinod kumar |
Mary Millben: ప్రధాని మోడీపై యూఎస్ సింగర్ మేరి మిల్‌బెన్ ప్రశంసలు.. కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: యేసుక్రీస్తును గౌరవించినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) పై యూఎస్ సింగర్ మేరి (Mary millben) మిల్ బెన్ ప్రశంసలు గుప్పించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘యేసుక్రీస్తు ప్రేమకు గొప్ప ఉదాహరణ. ఆయనను బహిరంగంగా గౌరవించినందుకు భారత ప్రధాని మోడీకి కృతజ్ఞతలు. క్రీస్తు బోధనలు ప్రేమ, సామరస్యం, సోదరభావాన్ని కలిగి ఉంటాయి. ఈ స్ఫూర్తిని మరింత దృఢంగా మార్చేందుకు మనమందరం కృషి చేయడం చాలా ముఖ్యం. మోడీ మాటలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారతీయులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. కాగా, గతంలోనూ మిల్‌బెన్ ప్రధాని మోడీని ప్రశంసించారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA)ను తీసుకొచ్చినప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి ఇది ఎంతో ముఖ్యమని కొనియాడారు. గతేడాది జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా మోడీని మిల్ బెన్ తొలిసారి కలిశారు.

Advertisement

Next Story