- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Govt: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్ ఇచ్చిన మంత్రి పొంగులేటి
దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. లబ్ధిదారుల ఎంపికపై విజిలెన్స్ద్వారా తనిఖీలు చేయిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. తాను కూడా తిరుగుతానని, తనిఖీ చేస్తానన్నారు. పేదల పక్షాన నిలబడటమే కాంగ్రెస్‌ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్‌బోర్డు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఒక ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ)గా ఎగ్జిక్యూటివ్ఇంజినీర్(ఈఈ)ను నియమిస్తున్నామని మంత్రి తెలిపారు. 33 జిల్లాల్లోనూ వీరు ఉంటారని తెలిపారు. వివిధ శాఖల్లో ఉన్న హౌజింగ్డిపార్ట్మెంట్ఉద్యోగులందరిని వెనక్కి తీసుకున్నామన్నారు.
ఈ ప్రభుత్వంలో 4.50 లక్ష ఇళ్లను మొదటి విడతలో మంజూరు చేస్తుందన్నారు. రాబోయే నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్లు కట్టడానికి కావాల్సిన యంత్రాంగాన్ని నియమిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలను నాలుగు దశల్లో ఇస్తామన్నారు. హడావుడిగా అయితే నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఎక్కడా పొరపాట్లు లేకుండా నింపాదిగా చేస్తున్నామన్నారు. ప్రజల అభ్యంతరాలు, సూచనలు నమోదు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇండ్ల పేరుతో హడావుడి చేయబోయిందన్నారు. కానీ ఎన్నికలకు సంబంధం లేకుండా పేదల పక్షాన నిలుస్తామన్నారు. సోమవారం వరకు దాదాపుగా 32 లక్షల మంది యాప్‌లో వివరాలు నమోదు చేసుకున్న వారి స్థితిగతులు, గ్రామం, ఇళ్లు, ఇంటి స్థలం ఎక్కడ నివసిజస్తున్నారు, దివ్యాంగులు, వితంతువులు తదితర వివరాలను సేకరిస్తున్నామన్నారు.
మొదట్లో కొంత పరిశీలన నత్తనడకన నడిచినా ప్రతి రోజు 4 నుంచి 5 లక్షల వరకు ధరఖాస్తులను పరిశీలిస్తున్నామని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం జనవరిలో 80 లక్షల మంది దరకాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిలో అర్హులు ఎవ్వరో తెలుస్తామన్నారు. ఈ టర్మ్‌లో 20 లక్షల ఇళ్లు ఇస్తామని, రెండోసారి మళ్లీ కాంగ్రెస్‌ప్రభుత్వమే వస్తుందని, అప్పుడు మిగిలిన వారికి ఇండ్లు ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోరికలు కోరినా, వారి షరతుకు అనుగుణంగా జాబితాను వారికి అందిస్తామని, వారు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేస్తుందన్నారు. జనవరి 4, 5 నాటిక కల్లా మొత్తం 80 లక్షల డేటాను పరిశీలిన పూర్తి చేస్తామన్నారు.
పరిశీలన యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తామన్నారు. ఈ సంవత్సరం ఇంటి స్థలం ఉన్న వారిలో 4.50లక్షల మందికి ఇండ్లను కేటాయిస్తామన్నారు. వచ్చే సంవత్సరం మిగిలిన వారికి నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము చెతులు దులుపుకోబోమని, 5లక్షలు ఇస్తామన్నారు. దీనిపై సీఎం సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన సూచనలు చేశారన్నారు. లబ్ధిదారుల ఎంపికకు రేషన్‌కార్డుతో సంబంధంలేదని పొంగులేటి మరోసారి స్పష్టం చేశారు. సంక్రాంతిలోగా హౌసింగ్ సిబ్బందిని వెనక్కి తీసుకవస్తామని, ఇప్పటికే అనేకమంది వెనక్కి వచ్చారన్నారు. అక్కడక్కడ మిగిలి పోయారని తెలిపారు. హౌసింగ్‌బోర్డు ఉద్యోగులకు సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలను త్వరలో ప్రకటించబోతున్నామన్నారు.
ఫిర్యాదులకు ప్రత్యేక వ్యవస్థ...
ప్రజలు ఫిర్యాదు చేయడానికి వారం రోజుల్లో యాప్, వెబ్సైట్, టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్చేసే వారికి తిరిగి కాల్చేసి మరిన్ని వివరాలను తీసుకుంటున్నామన్నారు. ఈ నెంబర్‌కు ఏ మారుమూల, గిరిజన, ఆదివాసీ ప్రాంతాల నుంచి ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకు సిమెంట్, స్టీల్, ఇసుక సరఫరాపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. లబ్ధిదారులు ఎవ్వరికి డబ్బులు ఇవ్వొద్దని ఆయన సూచించారు. హౌసింగ్ బోర్డుకు సంబంధించిన గతంలో భూములు తీసుకొని నిధులు చెల్లించని వారికి సంబంధించిన భూములపై ప్రహారిని పెట్టామన్నారు. ఇంకా స్పందించకపోతే వాటిని యాక్షన్పెడుతామన్నారు. గ్రామాల్లో సంక్రాంతిలోగా గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని ఏర్పాటు చేస్తామన్నారు. 1200 మంది సర్వేయర్లను నియమించబోతున్నామని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకవస్తామన్నారు.