Varun Dhawan: ఆ హీరోయిన్స్‌తో అలా ఉండడంపై స్పందించిన ప్రముఖ హీరో.. సెన్సేషనల్ కామెంట్స్ వైరల్

by Anjali |
Varun Dhawan: ఆ హీరోయిన్స్‌తో అలా ఉండడంపై స్పందించిన ప్రముఖ హీరో.. సెన్సేషనల్ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్‌కు ఓ ఇంటర్వ్యూలో చెక్ పెట్టాడు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్(Bollywood actor Varun Dhawan). ఓ కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అలియా భట్‌(Alia Bhatt)తో క్లోజ్‌గా మూవ్ అవ్వడం.. షూటింగ్‌లో అందరి ముందు నటి కియారా అద్వాణీ(Actress Kiara Advani)ని కిస్ పెట్టుకోవడంపై వరుణ్ ధావన్ తాజాగా క్లిరిటీ ఇచ్చారు.

చాలా రోజులుగా ఈ ఇష్యూస్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయని అన్నారు. ఇక షూటింగ్ నడుస్తున్నప్పుడు నేను నటీనటులు అందరితో ఒకేలాగా ఉంటానని వెల్లడించారు. నా సహనటులతో అనేక సార్లు ఫన్నీగా బిహేవ్ చేశానని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఆ విషయాల గురించి ఎవరూ అంతలా ఆరాతీసి ఆడగలేదని తెలిపారు. కానీ ప్రజెంట్ ఈ విమర్శలపై ప్రశ్నించినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందని వెల్లడించారు.

ఎందుకంటే ఇప్పుడైన ఈ విషయం గురించి సమాధానం ఇచ్చే చాన్స్ వచ్చిందని అన్నారు. ఇక కియారాను అందరిముందు ముద్దు పెట్టుకోవడానికి ఓ కారణముందని.. ఉద్దేశపూర్వకంగా అయితే పెట్టుకోలేది తెలిపారు. మ్యాగజైన్(magazine) ఫొటోషూట్‌లో భాగంగానే కిస్ పెట్టానని వివరించారు. ఈ ఫొటోను కియారా అద్వాణీ నేను ఇద్దరం కూడా అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నామని అన్నారు. కియారా మంచి నటి అని తెలిపారు.

అలాగే అలియా గురించి చెప్పాలంటే తను నాకు మంచి ఫ్రెండ్ అని వ్యాఖ్యానించారు. తనతో ఎప్పుడు ఫన్నీగానే ఉంటానని.. కావాలని తనతో అలా బిహేవ్ చేయలేదని, దాన్ని సరసమడడం అనరని.. ఇప్పటికీ మేమిద్దరం మిత్రులని వరుణ్ ధావణ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ బాలీవుడ్ నటుడి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story