- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Rs. 5000 Notes: వచ్చే ఏడాది రూ. 5000 నోట్లు విడుదల.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ..!

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం(Central Govt) 2025లో రూ. 5000 కరెన్సీ నోట్లను విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనాని, ఇప్పట్లో రూ. 5000 నోటును రిలీజ్ చేసే ప్రతిపాదనే లేదని రిజర్వ్ బ్యాంక్ ఇండియా(RBI) బుధవారం సృష్టం చేసింది. అసలు ఇలాంటి వదంతులు ఎలా మొదలయ్యోయో తమకు తెలియదని, ప్రస్తుతం చలామణి(Circulation) అవుతున్న నోట్లే దేశ ఆర్ధిక వ్యవస్థ(Economic System)కు సరిపోతాయని తెలిపింది. కాగా ఆర్బీఐ తొలిసారిగా రూ. 5 వేలు, రూ. 10 వేలు నోట్లను 1938లో ముద్రించింది. ఐతే ఎకానమీకి ఇబ్బందికి కలగడంతో 1967 తర్వాత రూ. 5000, రూ. 10000 నోట్లను వెనక్కి తీసుకున్నారు. కాగా ప్రస్తుతం భారతదేశంలో చలామణిలో ఉన్న అత్యధిక విలువైనదిగా రూ.500 నోటు ఉన్న సంగతి తెలిసిందే. 2016 డిమోనిటైజేషన్(Demonetization) తర్వాత ప్రవేశపెట్టబడిన రూ.2,000 నోటు అంతకమందు దేశంలో అత్యధిక విలువైన నోటుగా ఉండేది.