- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BGT 2024 : రేపటి నుంచి బాక్సింగ్ డే ఫైట్.. హ్యాట్రిక్ విజయంపై భారత్ ఫోకస్
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బాక్సింగ్ డే (నాలుగో)టెస్ట్ రేపటి(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో చివరగా ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్‌లను గెలుచుకున్న భారత్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అయినా ఈ సిరీస్‌లో భారత్‌ను అనేక సవాళ్లు వెంటాడుతున్నాయి. పెర్త్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఇప్పటి వరకు భారత బ్యాట్స్‌మెన్లు 300 పరుగుల మార్క్‌ను దాటలేదు. భారత బ్యాటింగ్ లైన్‌అప్ పటిష్టంగా ఉన్నా.. ఆటగాళ్లు రాణించకపోవడంతో టీంఇండియా ఈ సిరీస్‌లో ఇబ్బందులు పడుతోంది.
బ్యాట్స్‌మెన్లను వెంటాడుతున్న వరుస వైఫల్యాలు..
తొలి టెస్ట్‌లో సెంచరీ మినహా విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో రాణించలేదు. రోహిత్ శర్మ సైతం గతంలో లాగా ఆస్ట్రేలియాపై దూకుడుగా ఆడటం లేదు. యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్. రిషభ్ పంత్ ఆకట్టుకోవడం లేదు. అయితే లోయర్ ఆర్డర్‌లో నితిశ్ రెడ్డి, జడేజాలు ఒత్తిడిని తట్టుకుని పరుగులు రాబడుతున్నారు. బౌలింగ్‌లో బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నా.. ఇతర బౌలర్ల నుంచి అతనికి మద్దతు లభించడం లేదు. మెల్ బోర్న్‌లో గెలవాలంటే భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలపై మరింత దృష్టి సారించాల్సి ఉంది. ఈ టెస్ట్‌లో రోహిత్ శర్మ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడనేది పెద్ద ప్రశ్నగా మారింది. రోహిత్ ఓపెనింగ్‌కు వస్తాడని.. కేఎల్ రాహుల్ మూడో స్థానంలో బరిలోకి దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టీం మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది.
ఎంసీజీలో రికార్డు ఇలా..
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్ మొత్తం 14 టెస్ట్ మ్యాచ్‌లను ఆస్ట్రేలియాతో ఆడింది. ఇందులో నాలుగింటిలో విజయం సాధించింది. అందులో రెండు డ్రాగా ముగిశాయి. 2014లో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. 2018, 2020లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.
నితీశ్ రెడ్డిపై వేటు తప్పదా?
నాల్గవ టెస్ట్‌లో భారత్ తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డిపై వేటు వేసే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బుమ్రాకు బౌలింగ్‌లో సరైన మద్దతు లభించకపోవడంతో ఈ మేరకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. నితీశ్ రెడ్డి బ్యాటింగ్‌లో వరుసగా రాణిస్తున్నాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు జట్టుకు కీలక పరుగులు జోడిస్తున్నాడు. బౌలింగ్‌లో మాత్రం ఇప్పటి వరకు 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో భారత్ ఈ మేరకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగాలని భావిస్తోంది. వాషింగ్టన్ సుందర్, జడేజాలు బరిలోకి దిగే అవకాశం ఉంది. నాలుగో టెస్ట్‌లో నితీశ్ రెడ్డి లేదా శుబ్‌మన్ గిల్‌లో ఒకరికి టీం మేనేజ్‌మెంట్ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పేస్ బౌలర్లు బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్‌లను భారత్ ఆడించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఆసీస్ జట్టులో రెండు మార్పులు
మరో వైపు ఆస్ట్రేలియా తమ ప్లేయింగ్ XI ను ప్రకటించింది. ఫామ్‌లో ఉన్న కీలక ఆటగాడు ట్రావిస్ హెడ్ ఫిట్‌గా ఉండటంతో తుది జట్టులో స్థానం కల్పించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టులో రెండు మార్పులు చేసినట్లు ప్రకటించాడు. జోష్ హేజిల్ వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ ఆడనున్నట్లు తెలిపాడు. మెక్ స్వీనీ స్థానంలో సామ్ కొన్ స్టాస్ బరిలోకి దిగనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI
ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్ స్టాస్, మర్నూస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మెచెల్ స్టార్క్, నథన్ లయెన్, స్కాట్ బోలాండ్
భారత్ ప్రెడిక్షన్ ప్లేయింగ్ XI
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి/గిల్, రవీంద్ర జడేజా, బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్