రక్త దానంతో తలసేమియా బాధితులను ఆదుకోండి

by Naveena |
రక్త దానంతో తలసేమియా బాధితులను ఆదుకోండి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: రక్త దానంతో తలసేమియా బాధితులను ఆదుకోవాలని అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షుడు సిఆర్.భగవంతరావు,న్యాయవాది మనోహర్ రెడ్డి లు విజ్ఞప్తి చేశారు. బుధవారం పట్టణంలోని అయ్యప్పకొండపై నిర్వహించిన మహా పడి పూజ కార్యక్రమంలో రక్తదాన శిబిరాన్ని వారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..రక్తదానం మహా గొప్ప దానం అని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని కోరారు. రెడ్ క్రాస్ చైర్మెన్ నటరాజ్ మాట్లాడుతూ..అయ్యప్ప కొండపై ప్రతి సంవత్సరం నిర్వహించే మహా పడి పూజ కార్యక్రమ సందర్భంగా రక్తదానం శిబిరం నిర్వహించి తలసేమియా బాధితులను ఆదుకుంటున్నారని అన్నారు. భక్తి,మానవత్వం ప్రదర్శించి బాధితులను ఆదుకోవడం అభినందనీయమని,నేటి శిబిరంలో 338 మంది రక్తం దానం చేశారని నటరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పంబరాజు,మాల్యాద్రిరెడ్డి,నారాయణ,శరత్,రమణయ్య,తిరుపతిరెడ్డి,అశ్విని చంద్రశేఖర్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed