- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీ వైఫల్యం.. కోచింగ్ స్టాఫ్‌కు భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక సూచన
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ వైఫల్యంపై కోచింగ్ స్టాఫ్ చొరవ చూపాలని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. బుధవారం ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫోతో ఆయన మాట్లాడారు. ‘కోహ్లీ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను ఆడి ఔట్ అవడం సమస్య కాదు. కానీ ఆ సమస్యను పరిష్కరించాల్సిన బ్యాటింగ్ కోచ్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. అతను ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించకపోతే సాంకేతికంగా పెద్ద నష్టం జరుగుతుంది. కోహ్లీ తనంతటా తాను ఈ సమస్యను అధిగమించలేడు.’ అని మంజ్రేకర్ అన్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో కోహ్లీ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను ఆడుతూ వరుసగా వికెట్ చేజార్చుకుంటున్నాడు. పెర్త్ టెస్ట్‌లో సెంచరీతో రాణించిన కోహ్లీ తర్వాత ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో 7, 11, 3 పరుగులు మాత్రమే చేశాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను వరుసగా ఆడుతూ ఎడ్జ్ తీసుకోవడం ద్వారా ఔట్ అవుతున్నాడు. వరుస వైఫల్యాలతో తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 21వ స్థానానికి పడిపోయాడు.