Ravi Shastri : కోహ్లీ, స్మిత్ బౌన్స్ బ్యాక్ చేస్తారు.. స్టార్ట్ బ్యాట్స్‌మెన్లకు రవి శాస్త్రి సపోర్ట్

by Sathputhe Rajesh |
Ravi Shastri :  కోహ్లీ, స్మిత్ బౌన్స్ బ్యాక్ చేస్తారు.. స్టార్ట్ బ్యాట్స్‌మెన్లకు రవి శాస్త్రి సపోర్ట్
X

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ బౌన్స్ బ్యాక్ చేస్తారని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఐసీసీ రివ్యూలో ఆయన బుధవారం మాట్లాడారు. ‘ఫామ్‌‌లో లేని కారణంగా కోహ్లీ, స్మిత్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో వెనకబడ్డారు. రూట్, విలియమ్‌సన్ స్థిరంగా రాణించడంతో టాప్‌‌లో ఉన్నారు. హ్యారీ బ్రూక్ సైతం బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తున్నాడు. విరాట్, స్మిత్‌లు పరుగులు చేయడానికి ఆకలిగా ఉన్నారు. కోహ్లీ ఫామ్‌లో లేడని భావించడం లేదు. అతను క్రీజులో 30-40 నిమిషాలు గడపాలి. అప్పుడే అతను పరుగులు చేయగలడు.’ అని శాస్త్రి అన్నాడు. కోహ్లీ, స్మిత్ ఇద్దరు ప్రమాదకరమైన ఆటగాళ్లని ఆయన గుర్తు చేశారు. ఎంత ఒత్తిడి ఉన్నా బౌన్స్ బ్యాక్ చేయగల సత్తా ఇద్దరిలో ఉందన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఈ ఇద్దరు ఆటగాళ్లు చెరో సెంచరీ మాత్రమే చేశారు. యంగ్ ప్లేయర్లు ర్యాంకుల్లో దూసుకుపోతున్నారని.. కానీ కోహ్లీ, స్మిత్ క్లాస్ ప్లేయర్లు అని ఆయన గుర్తు చేశారు. క్రమశిక్షణగా ఉండి స్మిత్ పరుగులు రాబట్టాడని.. కోహ్లీ సైతం అదే ఫార్ములా ఉపయోగించాలన్నాడు.

Advertisement

Next Story

Most Viewed