పోలీస్‌ స్టేషన్ ను తనిఖీ చేసిన ఆర్మూర్ ఏసీపీ

by Naveena |
పోలీస్‌ స్టేషన్ ను తనిఖీ చేసిన ఆర్మూర్ ఏసీపీ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ డిసెంబర్ 25: వార్షిక తనిఖీలో భాగంగా భీమ్ గల్ పోలీస్ స్టేషన్ ను ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణను అంతా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసులకు సంబంధించిన ఫైల్స్ ను పరిశీలించి, పలు కేసుల విషయమై ఆరా తీశారు. పెండింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ రికార్డులను ఏసీపీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కార్యక్రమం లో భీమ్ గల్ సీఐ పి. నవీన్, ఎస్ ఐ జి.మహేష్ , ఏఎస్ఐ అబ్దుల్ సత్తార్ లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed