Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనానికి ప్రయత్నాలు

by Jakkula Mamatha |
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనానికి ప్రయత్నాలు
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో టీటీడీ శ్రీవారి భక్తులకు(Devotees) గుడ్ న్యూస్ చెప్పింది. ఏఐ సాయంతో 2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ(TTD) చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లో నిరీక్షించే అవసరం లేకుండా ఒకటి, రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేలా అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(Artificial Intelligence) సహకారంతో ‘ఫేస్‌ రికగ్నేషన్‌ ఎంట్రీ’ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని గత బోర్డులో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

ఈ విధానం అమలుకు ఇప్పటికే పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీపై బెంగళూరుకు చెందిన ఓ సంస్థ టీటీడీ ఛైర్మన్(TTD Chairman) కార్యాలయంలో డెమో చూపించింది. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు(BR Naidu), ఈవో శ్యామలరావు(TTD EO), సభ్యులు, ఉన్నతాధికారులు ఈ డెమోను వీక్షించారు. టోకెన్ జారీ, ఫేషియల్ రికగ్నిషన్, బ్యారియర్ గేట్ వద్ద నిలబడితే ఆటోమెటిక్‌గా తెర్చుకోవడం తదితర అంశాలను టీటీడీ సభ్యులు, అధికారులు పరిశీలించారు. ఇంకొన్ని డెమోల తర్వాత ఓ సంస్థను ఎంపిక చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed