BJP: వారి డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి.. సీఎంకు బీజేఎల్పీ నేత ఏలేటి బహిరంగ లేఖ

by Ramesh Goud |   ( Updated:2024-12-24 16:53:01.0  )
BJP: వారి డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి.. సీఎంకు బీజేఎల్పీ నేత ఏలేటి బహిరంగ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: గత ఆగష్టు నుండి నిరవధిక సమ్మెలో ఉన్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల(SSA Employees) డిమాండ్లు(Demands) తక్షణమే పరిష్కరించాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(BJLP Leader Eleti Maheshwar Reddy) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) బహిరంగ లేఖ(Letter) రాశారు. ఈ లేఖలో రేవంత్ రెడ్డి.. గతంలో కాంగ్రెస్(Congress) ఏర్పడిన వెంటనే వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్(Regularize) చేస్తామని హామీ ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా వారి సమస్యలను అటకెక్కించారని విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు అలవి కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, ఏ ఒక్క హమీని కూడా పూర్తిగా నెరవేర్చకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని మండిపడ్డారు. ఇక సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరించాలని, వారికి ఉద్యోగ భద్రతతో కూడిన పేస్కేల్ ఇవ్వాలని, భీమా సహా పదవీ విరమణ సమయంలో ఆర్థిక సాయం చేయాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. అంతేగాక ఈ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో బీజేపీ ఆధ్వరంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏలేటి హెచ్చిరించారు.

Advertisement

Next Story

Most Viewed