Winter: తెలంగాణను వణికిస్తున్న చలి.. ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలు

by Mahesh |
Winter: తెలంగాణను వణికిస్తున్న చలి.. ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మరోసారి చలి తీవ్రత(severity of cold ) పెరిగిపోయింది. గత రెండు రోజుల పాటు సాధారణ స్థాయిలో ఉన్న ఉష్ణోగ్రతలు(Temperatures) మంగళవారం ఉదయం మరోసారి పడిపోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగి పోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో పల్లెలు పట్టణాలు అని తేడా లేకుండా.. ఎక్కడ చూసిన చలిమంటలు దర్శనమిస్తున్నాయి. అలాగే పలు ప్రాంతాల్లో మంచు(Snow) అధికంగా కురుస్తుండటంతో రహదారులపై ప్రయాణం ప్రమాదకంగా మారుతున్నట్లు వాహనదారులు(Motorists) తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. మంగళవారం తెల్లవారుజామున రాష్ట్రంలో పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి. ముఖ్యంగా ఆదిలాబాద్‌లో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. మెదక్‌లో 16.6 డిగ్రీలు, పటాన్‌చెరులో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు, హకీంపేట్‌లో 16.4 డిగ్రీలు..నిజామాబాద్‌, హైదరాబాద్‌లో 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత పెరిగిపోవడంతో తెల్లవారుజామున ఎక్కడ చూసిన రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed