- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మరొక్కసారి థియేటర్స్‌లోకి రాబోతున్న ‘ఓయ్’.. రీ-రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన విడుదల

దిశ, సినిమా: సిద్ధార్థ్(Siddharth), షాలిని జంటగా నటించిన చిత్రం ‘ఓయ్’(Oy). ఈ సినిమాకు ఆనంద్ రంగా దర్శంకత్వం వహించగా.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్(DVV Entertainments) బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు. సాడ్ ఎండింగ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ 2009లో విడుదలై బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది.
అయితే ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే సందర్భంగా రీ- రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద కుమ్మేసింది. భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మరోసారి ఈ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. న్యూ ఇయర్(New Year) రోజున జనవరి 1న విడుదల కానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు. మరొక్కసారి అంటూ రెడ్ హార్ట్ సింబల్ షేర్ చేశారు.
Marokkasari ❤️#OY pic.twitter.com/KXsxFQGunf
— DVV Entertainment (@DVVMovies) December 23, 2024