- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BSF jawan: పాకిస్థాన్ వద్ద బందీగా బీఎస్ఎఫ్ జవాన్.. ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ (India Pakisthan) ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్‌కు చెందిన ఓ జవాన్‌ను పాక్ బందీగా చేసుకుంది. బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) కు చెందిన పీకే సింగ్ (Pk singh) అనే సైనికుడు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో ఇండో పాక్ అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గర్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే అనుకోకుండా కంచె దాటాడు. దీంతో పాక్ రేంజర్లు జవాన్‌ను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన వద్ద ఉన్న ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను భారత ఆర్మీ వర్గాలు ధ్రువీకరించాయి.
సమాచారం అందిన వెంటన బీఎస్ఎఫ్ జవాన్లు సరిహద్దుకు చేరుకున్నారు. భారత సైనికుడిని విడుదల చేయడానికి పాకిస్థాన్ (Pakisthan) రేంజర్లతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే జవాన్ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. బీఎస్ఎఫ్ అధికారులు పాక్ రేంజర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే తమ భూభాగంలోకి రావడం వల్లే సైనికుడిని బందీగా పట్టుకున్నామని పాక్ వెల్లడించగా దీనిని బీఎస్ఎఫ్ అధికారులు ఖండించారు. జవాన్ బార్డర్ దాటలేదని పాక్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. జవాన్‌ను సురక్షితంగా తిరిగి రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.