School Holidays:విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి స్కూళ్లకు సెలవులు

by Jakkula Mamatha |   ( Updated:2024-12-24 02:49:26.0  )
School Holidays:విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి స్కూళ్లకు సెలవులు
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ(Telangana)లో క్రిస్మస్(Christmas) సంబరాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో క్రిస్మస్ సెలవుల(Holidays) కోసం విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. దీంతో తాజాగా క్రిస్మస్ సెలవులు పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు(మంగళవారం) స్కూళ్లకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇస్తూ డీఈవో(DEO)లు ఉత్తర్వులు జారీ చేశారు.

అటు తెలంగాణలో రేపు, ఎల్లుండి పబ్లిక్ హాలిడేలు ఉండటంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చినట్లయింది. డిసెంబర్‌ 25, 26 తేదీల్లో పబ్లిక్ హాలీడేస్‌గా ప్రకటించారు. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ (Christmas) పండుగ కాగా.. డిసెంబర్‌ 26న బాక్సింగ్‌ డే (Boxing Day 2024) కావడంతో ఈ రెండు రోజులు స్కూళ్లు(School), కాలేజీలు(College), ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ఉంటాయి. ఏపీలో రేపు పబ్లిక్ హాలీడే ఉండగా 26న ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది.

Next Story

Most Viewed