- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Formula E-Car Race: ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. నిందితులకు ఏసీబీ నోటీసులు!

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-కారు రేసు (Formula E-Car Race)లో కేసులో ఏసీబీ (ACB)తో సహా ఈడీ (ED) అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే ఫార్ములా ఈ-కారు రేస్ కంపెనీలు, రూ.55 కోట్ల లావాదేవీలు, స్పాన్సర్‌షిప్ కంపెనీల వివరాలను సైతం ఏసీబీ సేకరించింది. ఈ మేరకు కేసులో కీలక నిందితులుగా ఉన్న బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR), ఐఏఎస్ అరవింద్ కుమార్ (Aravind Kumar), హెచ్ఎండీఏ (HMDA) మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy)కి నేడు లేదా రేపు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
కాగా, బీఆర్ఎస్ సర్కార్ (BRS Government) హయాంలో హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ-కారు రేస్ (Formula E-Car Race) నిర్వహణలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది. అయితే, కేసులో అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) పేరును అధికారులు A1గా చేర్చారు. ఈ క్రమంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రొసీజర్ ప్రకారం.. నోటీసులు ఇచ్చిన విచారణ చేపట్టాలని సూచించింది.