- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్‌యూజే (ఐ) వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా మోహన్
దిశ, వరంగల్ : ఎన్‌యూజే (ఐ) వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కందికొండ మోహన్ ఎన్నికయ్యారు. శుక్రవారం వరంగల్ జిల్లా తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ వరంగల్ జిల్లా జర్నలిస్టుల కమిటీ సమావేశం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తోకల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీ పునర్వ్యవస్థీకరణ జరిగింది. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని హాజరయ్యారు.సమావేశంలో కండికొండ మోహన్ అధ్యక్షుడిగా, అవునూరి కుమారస్వామి జనరల్ సెక్రటరీగా, బత్తుల సత్యం ఖజాంచీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పురుషోత్తం నారగౌని మాట్లాడుతూ… జర్నలిస్టుల రక్షణ చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణ కోసం జర్నలిస్టు రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు పరచాలని అన్నారు. జర్నలిస్టులపై దాడులు, వేధింపులు, తప్పుడు కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే చట్టం తీసుకురావాలని కోరారు.