- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajamouli: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రాబోతున్న ‘బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ
దిశ, సినిమా: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు మంత్రముగ్దులను చేశారు. ఈ చిత్రం 2022లో విడుదలై ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు పలు అవార్డులను కూడా సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా ఆస్కార్ అవార్డు(Oscar Award) దక్కించుకున్న చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా స్థాయిని మరింత పెంచడానికి రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై డాక్యుమెంటరీని సిద్ధం చేశారు.
ఈ విషయాన్ని తెలుపుతూ ఇటీవల డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్(DVV Entertainments) అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న వారిలో క్యూరియాసిటీ పెరిగింది. ఈ డాక్యుమెంటరీ థియేటర్స్‌లో విడుదల చేస్తారా? లేక ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల అయింది.
‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’(RRR: Behind and Beyond) హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ‘X’ ద్వారా ఓ ట్వీట్ చేసింది. ‘‘తెర వెనుక, వారసత్వానికి మించి. ఎస్‌ఎస్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మేకింగ్ ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’(RRR: Behind and Beyond) . డిసెంబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది కచ్చితంగా చూడండి’’ అని రాసుకొచ్చారు. అలాగే ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేయడంతో సినీ ప్రియులు ఆనందపడుతున్నారు.
Behind the scenes, beyond the legacy.
— Netflix India South (@Netflix_INSouth) December 23, 2024
Watch RRR: Behind and Beyond, an exclusive peek into the making of SS Rajamouli’s magnum opus on Netflix, out 27 December!#RRRBehindAndBeyondOnNetflix pic.twitter.com/Py9pyL7Nws