- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఛత్రినాకలో డబ్బుల విషయంలో ఘర్షణ..ఒకరు మృతి
దిశ, చార్మినార్ : డబ్బుల విషయంలో ఇంటి యజమానికి కిరాయి దారుడికి మధ్య జరిగిన ఘర్షణలో యజమాని కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఛత్రినాక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ....ఉప్పుగూడ పటేల్‌నగర్ ప్రాంతానికి చెందిన డి.శ్రీనివాస్ కుమారుడు డి.మనీష్‌కుమార్ (27). శ్రీనివాస్ కు సంబంధించిన మరొక ఇంట్లో గత నాలుగేండ్ల క్రితం దేవి, రాజునాయక్ కుటుంబం అద్దెకు దిగారు. వీరికి ఇద్దరు సంతానం. వీరికి కె.శివ (19) సంతానం. నాలుగేళ్లు గా అక్కడే ఉంటున్న చనువుతో ఇంటి యజమాని వద్ద కూతురు పెండ్లికని దేవి ఆరునెలల క్రితం రూ.5.70లక్షలు అరువుగా తీసుకున్నారు. అప్పటి నుంచి ఇంటి యజమాని డబ్బులు ఎప్పుడు అడిగినా దేవి పొలం అమ్మి ఇస్తా అంటూ వాయిదాలు పెట్టసాగింది. ఎక్కువగా ఊర్లోనే ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే దేవి ఉప్పుగూడకు వచ్చేది. ఈ నెల 10 వ తేదీన దేవి ఉప్పుగూడ కు వచ్చింది. దేవి తిరిగి ఈ నెల 12 వ తేదీన వెళ్దామన్న ప్రయత్నంలో ఉండగా ఈ విషయం కాస్త ఇంటి యజమాని శ్రీనివాస్‌కు తెలిసింది. దీంతో ఇంటి యజమాని శ్రీనివాస్ తో పాటు అతని కుమారుడు మనీష్కుమర్ లు తమకు చెందిన మరో ఇంట్లో అద్దెకుంటున్న దేవి వద్దకు వెళ్లారు. డబ్బుల విషయంలో వారి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.
డబ్బులు ఇవ్వకపోతే తమకు చావే శరణ్యమని శ్రీనివాస్ బెదిరించాడు. పొలం అమ్మి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని దేవి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. దీంతో కలత చెందిన శ్రీనివాస్ ఇంటి నుంచి బయటికి వెళ్లి పెట్రోల్ డబ్బాను తీసుకు వచ్చి తన ఒంటిపై పోసుకోవడానికి ప్రయత్నించగా, నువ్వెందుకు చస్తావు డాడీ అంటూ కుమారుడు మనీష్‌కుమార్ ఒంటిపైన పెట్రోల్ పోసుకోవడమే గాకుండా దేవి మీద పెట్రోల్ పోయడానికి ప్రయత్నించగా అడ్డుగా వచ్చిన ఆమె కుమారుడు శివ పై పడింది. పక్కనే వంటమనిషి క్యాట్రింగ్ వంటలు చేస్తున్న స్టవ్ పై పెట్రోల్ పడడంతో ఒక్క సారిగా శివకుకుమార్, మనీష్కుమార్లపై మంటలు అంటుకున్నాయి. శివను చికిత్స నిమిత్తం అస్రా ఆసుపత్రికి, మనీష్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న మనీష్ కుమార్ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. చత్రినాక పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా దేవి ఇంట్లోకి శ్రీనివాస్ పెట్రోల్ డబ్బాతో లోనికి వెళ్లడం... మూడు నిమిషాలకే కాలిన గాయాలతో ఇంటి యజమాని బయటికి రావడం స్పష్టంగా రికార్డయింది. ఇది ఇలా ఉండగా దేవి ఇంటి యజమాని శ్రీనివాస్ కు రూ. 13 లక్షలతో పాటు 9 నెలల అద్దె బకాయి ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఈ కేసును ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.