Forum for Good Governance: ఆరేళ్లుగా కాగితాలకే పరిమితం.. సీఎం రేవంత్‌కు లేఖ

by Gantepaka Srikanth |
Forum for Good Governance: ఆరేళ్లుగా కాగితాలకే పరిమితం.. సీఎం రేవంత్‌కు లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అక్రమ కట్టడాలతో ప్రణాళికా బద్దంగా పట్టణాలు అభివృద్ధి చెందడం లేదని, ఆ కట్టడాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(Forum for Good Governance) అధ్యక్షుడు పద్మనాభరెడ్డి అన్నారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి లేఖ రాశారు. మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకునే సందర్భంలో బిల్డర్లు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకొని అక్రమ కట్టడాలు పూర్తి చేయడమే కాకుండా అమ్మతున్నారన్నారు. వాటిని కొనుగోలు చేసిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2016లో అక్రమట కట్టడాల నిర్మాణం నిలిపివేయడానికి కేసులు త్వరితగతిన పూర్తికి మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యూనల్ ఏర్పాటు చేసిందన్నారు.

ఇందులో జడ్జి చైర్ పర్సన్ గా, డైరెక్టర్ గా టౌన్ ప్లానింగ్ అధికారి సభ్యులుగా ఉంటారని, మున్సిపల్ అధికారులు కట్టడాలపై ఇచ్చిన నోటీసులు పరిశీలించి పరిష్కరిస్తారన్నారు. కానీ చైర్ పర్సన్, అలాగే సాంకేతిక సభ్యలు నియామకం చేయడంతో గత ఆరేళ్లుగా ట్రిబ్యునల్ కాగితాలకే పరిమితమైందన్నారు. 2022 ఏప్రిల్ 27న నాలుగు వారాల్లో ట్రిబ్యునల్ చైర్ పర్సన్, సాంకేతిక సభ్యుల నియామకం చేస్తామని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో పేర్కొన్నారని తెలిపారు. హైకోర్టు ట్రిబ్యునల్ చైర్మన్ నియామకానికి ముగ్గురు విశ్రాంత జడ్జిల పేర్లు కూడా పంపినీ ప్రభుత్వం లో చర్యలు లేవన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బిల్డింగ్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్, సాంకేతిక సభ్యులు, ఇతర సిబ్బందిని తక్షణమే నియమించి ట్రిబ్యునల్ నడిచే విధంగా చర్యలు చేపట్టాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story