- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy : కోటి దీపోత్సవానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కోటి దీపోత్సవ(Koti Deepotsavam) కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో కార్తీకమాసం సందర్భంగా ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం దంపతులకు పండితులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం.. అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్తీక దీపాలను సీఎం రేవంత్ రెడ్డి వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ శైవ క్షేత్రం అన్నారు. ఆ శివుని దయతో పాడిపంటలతో, ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలోని భక్తులందరికీ భక్తిని పంచుతున్నందుకు ఈ కార్యక్రమ నిర్వహకులను అభినందిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమ స్పూర్తితో వారిని ఆదర్శంగా తీసుకొని.. తాము రాష్ట్రవ్యాప్తంగా అన్ని గుళ్ళలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలియ జేశారు.
- Tags
- CM Revanth Reddy