- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వృద్ధురాలి మెడలో పుస్తెల తాడు అపహారణ
by Naveena |
X
దిశ, దుగ్గొండి: వృద్ధురాలి మెడలో నుండి పుస్తెల తాడు అపహరణకు గురైన ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చలపర్తి గ్రామ శివారులో చోటు చేసుకుంది. దుగ్గొండి సీఐ సాయి రమణ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన పాలడుగుల మల్లమ్మ (70) శుక్రవారం సాయంత్రం నర్సంపేటకు వెళ్లి పనులు ముగించుకొని లక్నెపల్లి లో దిగి స్వగ్రామమైన తిమ్మంపేట కు నడుచుకుంటూ వెళ్తుండగా చలపర్తి గ్రామం ఎస్సీ కాలనీ శివారులో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి మల్లమ్మ మెడలో ఉన్న రెండున్నర పుస్తెల తాడును అపహరించుకుపోయారు. ఈ క్రమంలో ఆమె మెడకు చిన్న గాయమైంది. వెంటనే మల్లమ్మ కేకలు వేయడంతో అటు వెళుతున్న వారు దొంగలను వెంబడించగా ఫలితం లేకుండా పోయింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Advertisement
Next Story