- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పరమశివుని కృప కటాక్షాలతో ప్రజలంతా వర్ధిల్లాలి : నీలం మధు
దిశ,పటాన్ చెరు : పరమశివుడి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని టిజిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి,మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మాజీ సర్పంచ్,ఎంపీటీసీ గడ్డం బాలమణి- శ్రీశైలం ఏర్పాటు చేసిన కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమానికి టీజిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి తో కలిసి నీలం మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ నదుల నుంచి సేకరించిన పవిత్ర నది జలాలచే 108 కలశాలతో కలశాభిషేకం నిర్వహించారు. మొదట లక్ష్మీ గణపతి హోమం తో కార్యక్రమంలో రుద్రాభిషేకం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం నిర్మలా జగ్గారెడ్డి, నీలం మధు మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా కార్తీక మాసానికి దివ్యమైన విశిష్టత ఉందన్నారు. పరమ శివుడికి మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించి శివ కేశవులను ఆరాధిస్తారని తెలిపారు. అనంతరం నిర్వాహకులు నిర్మల జగ్గారెడ్డి , నీలం మధు ని ఘనంగా సత్కరించారు. ఆ శివకేశవుల ఆశీస్సులతో కార్తీక దీపాల వెలుగులు ప్రజలందరి జీవితాల్లో వెలగాలని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..