- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Elon Musk : స్పేస్ ఎక్స్ రాకెట్‌తో ‘జీశాట్ - 20’ ప్రయోగం.. ఎలాన్ మస్క్‌కు రూ.591 కోట్ల కాంట్రాక్టు
దిశ, నేషనల్ బ్యూరో : భారతదేశపు(India) అత్యాధునిక కమ్యూనికేషన్ శాటిలైట్ ‘జీశాట్ - 20’ ప్రయోగం నవంబరు 19న(మంగళవారం) జరగనుంది. అమెరికాలోని కేప్ కెనవెరల్ ప్రాంతంలో ఎలాన్ మస్క్(Elon Musk) కంపెనీ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా 4,700 కేజీల ‘జీశాట్ - 20’ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి పంపనున్నారు. వాస్తవానికి ఇంత బరువున్న శాటిలైట్లను మోసుకెళ్లే రాకెట్లు ఇస్రో వద్ద అందుబాటులో లేవు. ఇస్రో వద్దనున్న బాహుబలి రాకెట్ ‘లాంచ్ వెహికల్ మార్క్3’ (ఎల్‌వీఎం 3) గరిష్టంగా 4,100 కేజీల శాటిలైట్‌ను మాత్రమే మోసుకెళ్లగలదు.
అందుకే కీలకమైన ‘జీశాట్ - 20’ ఉపగ్రహ ప్రయోగం కాంట్రాక్టును స్పేస్ ఎక్స్ కంపెనీకి ఇస్రో కేటాయించింది. దీనికి సంబంధించి ఇస్రోకు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్), స్పేస్ ఎక్స్ మధ్య కాంట్రాక్టు కుదిరింది. ఈ ప్రయోగం కోసం దాదాపు రూ.591 కోట్లను స్పేస్ ఎక్స్‌ను ఎన్ఎస్ఐఎల్ చెల్లించింది. ‘జీశాట్ - 20’ శాటిలైట్ ప్రయోగం సక్సెస్ అయితే మన దేశంలో కమ్యూనికేషన్ వ్యవస్థలు మరింత సమర్ధంగా పనిచేస్తాయి. విమానాల్లో మరింత క్వాలిటీతో కూడిన ఇంటర్నెట్ వసతి అందుబాటులోకి వస్తుంది.