- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాన్నే... మా హీరో.. విద్యార్థిని భావోద్వేగం
దిశ, వెల్దండ : మా నాన్న.. చిన్నప్పటినుండి మా కుటుంబం కోసం.. మా భవిష్యత్తు కోసం ఎన్నెన్నో కష్టాలు పడుతున్నాడు.. అవమానాలు ఎదుర్కొన్నాడు. మా భవిష్యత్తు కోసం సర్వస్వం త్యాగం చేస్తున్న మా నాన్నె మా హీరో అంటూ నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థిని గడ్డం నందిని బాలల దినోత్సవం సందర్భంగా అదే పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న తన తండ్రి పాదాలు కడిగి చేసిన వ్యాఖ్యానాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వివరాలలోకి వెళితే.. వెళ్ళండి మండల కేంద్రానికి చెందిన గడ్డం వెంకటయ్య ఇంటర్మీడియట్ వరకు చదివి ఆర్థిక పరిస్థితుల కారణంగా తన చదువును మధ్యలోనే ఆపి కూలి పనులు, డ్రైవింగ్ చేస్తూ వచ్చాడు. 2014 నుండి మోడల్ స్కూల్లో ఔట్సోర్సింగ్ ద్వారా అటెండర్ గా .. పనిచేస్తూ వస్తున్నాడు. చాలీచాలని జీతంతో తన భార్య గడ్డం లక్ష్మమ్మతో కలిసి తన పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాడు. కుమారుడు గడ్డం మహేష్ పీజీ చదువుతుండగా, పెద్ద కూతురు మనీషా బిఎడ్ చేస్తూ ఉండగా.. రెండవ కూతురు గడ్డం నందిని వెంకటయ్య పని చేస్తున్న మోడల్ స్కూల్లోనే ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది. బాలల దినోత్సవం సందర్భంగా మోడల్ స్కూల్ లో తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటయ్యకు ఆయన కుమార్తె నందిని పాదపూజ చేసి ఉద్వేగ ఫలితంగా మా నాన్న మా కోసం ఎన్నో కష్టాలు.. నష్టాలు పడుతున్నాడు.. ఆయన మా హీరో అంటూ వ్యాఖ్యానించి ఉంచడం అక్కడికి వచ్చినవారినే కాదు.. ఆమె తన తండ్రి పట్ల ప్రదర్శించిన ప్రేమ ఆప్యాయతలు సామాజిక మాధ్యమాలలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తల్లిదండ్రుల పట్ల పిల్లల ప్రేమను.. భక్తిని ప్రదర్శించేలా ఈ కార్యక్రమం నిర్వహించడం, తండ్రిగా తన పిల్లల కోసం తాను, తన భార్య ఇబ్బందులు పడుతున్న వారు గొప్ప చదువులు చదువుతుంటే ఎంతో ఆనందం వేస్తుందని చెప్పుకొచ్చారు.