- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Liquor Ban : మద్య నిషేధంతో లాభపడింది అధికారులే.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : బిహార్(Bihar)లో 2016 ఏప్రిల్ నుంచి మద్యపాన నిషేధం(Liquor Ban) అమలవుతున్న తీరుపై పాట్నా హైకోర్టు(Patna High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. మద్యపాన నిషేధం ముసుగులో అనధికారిక మద్యం సరఫరా పెరిగిపోయిందని న్యాయమూర్తి జస్టిస్ పూర్ణేందు సింగ్ కీలక కామెంట్స్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బిహార్‌లో అక్రమ మద్యం తయారీ, సరఫరా, విక్రయ వ్యవస్థలు ఏర్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మద్యపాన నిషేధ చట్టం అమల్లో ఉండాలని ప్రజల కంటే పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులే ఎక్కువ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇది వాళ్లకు కాసులు కురిపిస్తోంది’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘‘ప్రజారోగ్యాన్ని కాపాడాలన్న గొప్ప లక్ష్యంతో మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే ఇదే అదునుగా కొందరు ప్రభుత్వ అధికారులు అక్రమ ఆదాయాన్ని గడిస్తున్నారు’’ అని పాట్నా హైకోర్టు బెంచ్ తెలిపింది. ‘‘బిహార్‌లో మద్యం తాగే పేదలపైనే పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కేసులు పెడుతున్నారు. మద్యం విక్రయాలు జరిపే దళారులు, సిండికేట్లపై కేసులు ఎందుకు నమోదు కావడం లేదు ? ఈ చట్టాన్ని అధికారులు సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు’’ అని న్యాయస్థానం ధ్వజమెత్తింది.
కేసు వివరాలివీ..
2020 సంవత్సరంలో పాట్నా బైపాస్ పోలీసు స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో ఒక మద్యం గోదామును ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. ఆ గోదాములో విదేశీ మద్యం కూడా ఉందని నిర్ధారించారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఎక్సైజ్ శాఖ అధికారులు సమాచారాన్ని అందజేశారు. దీంతో పాట్నా బైపాస్ పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) ముకేశ్ కుమార్ పాశ్వాన్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అంతేకాదు పాశ్వాన్‌ను ఇన్ స్పెక్టర్ స్థాయి నుంచి సబ్ ఇన్ స్పెక్టర్ స్థాయికి డిమోట్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై శాఖాపరమైన చర్యలను నిలుపుదల చేయాలంటూ పాట్నా హైకోర్టులో ముకేశ్ కుమార్ పాశ్వాన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని విచారించిన న్యాయస్థానం .. ముకేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయడానికి దారితీసిన సరైన కారణాలను, ఆధారాలను పోలీసు ఉన్నతాధికారులు చూపించలేకపోయారని తెలిపింది. అతను విధుల్ని ఎలా నిర్లక్ష్యం చేశాడో నిరూపించలేకపోయారని పేర్కొంది. ముకేశ్ కుమార్ పాశ్వాన్‌పై పోలీసు శాఖ తీసుకున్న చర్యలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. పోలీసు, ఎక్సైజ్ అధికారులు మద్యం సిండికేట్లతో చేతులు కలిపి, అక్రమ మార్గాల్లో మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు కనిపిస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.