G20 Summit: బ్రెజిల్‌ జీ20 సమ్మిట్‌లో కీలకంగా యుద్ధ పరిస్థితులు, ట్రంప్ గెలుపు

by S Gopi |
G20 Summit: బ్రెజిల్‌ జీ20 సమ్మిట్‌లో కీలకంగా యుద్ధ పరిస్థితులు, ట్రంప్ గెలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే వారం జీ20 శిఖరాగ్ర సమావేశం బ్రెజిల్‌లో జరగనుంది. ఈ సమావేశానికి జీ20 దేశాల అధినేతలు రానున్నారు. ఇందులో ప్రధానంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారం దక్కించుకోవడం వంటి అంశాలు కీలకంగా ఉండనున్నాయి. ఇటీవల బ్రెజిల్ సుప్రీంకోర్టు వెలుపల బాంబు దాడి ప్రయత్నం నేపథ్యంలో సమావేశానికి భద్రతను కట్టుదిట్టం చేశారు. జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనున్న వేదిక రియో డి జనీరోలోని మ్యూజియం ఆఫ్ మోడ్రన్ ఆర్ట్‌ను ఆనుకుని ఉంటుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పరిస్థితుల గురించి అన్ని దేశాలతో చర్చలు జరపనున్నామని బ్రెజిల్ ప్రధాన దౌత్య అధికారి మారిసియో లిరియో చెప్పారు. జీ20 సమ్మిట్ 'ఆకలి, పేదరికానికి వ్యతిరేకంగా గ్లోబల్ అలయన్స్ ' అంశంతో మొదలుకానుంది. అలాగే, జూన్‌లో జరిగిన సమావేశంలో బిలియనీర్లపై పన్ను విధించే అంశంపై ఆయా దేశాల ఆర్థిక మంత్రులు సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. దేశాధినేతలు దానికి కట్టుబడి ఉంటారా లేదా అనేది చూడాలి. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిరాకరించారు. అయితే, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సమావేశంలో పాల్గొననున్నారు.

Advertisement

Next Story

Most Viewed