India : త్వరలో చైనా రక్షణమంత్రితో రాజ్‌నాథ్ భేటీ.. ఎజెండా ఏమిటంటే..

by Hajipasha |
India : త్వరలో చైనా రక్షణమంత్రితో రాజ్‌నాథ్ భేటీ.. ఎజెండా ఏమిటంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : నవంబరు 20న లావోస్ దేశంలో జరగనున్న ఆసియాన్ సదస్సు వేదికగా భారత(India) రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా(China) రక్షణ మంత్రి డాన్ జున్ భేటీ కానున్నారు. తూర్పు లడఖ్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా, భారత్ సైన్యాల పెట్రోలింగ్ అంశంపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో 2020 ఏప్రిల్‌కు మునుపటి స్థానాలకు ఇరుదేశాలు సైన్యాలను వెనక్కి పిలుచుకునే అంశంపై డిస్కషన్ జరగనుంది.

ఇరుదేశాల నడుమ సైనిక ఉద్రిక్తతలు తగ్గిన ప్రస్తుత తరుణంలో డాన్ జున్‌తో రాజ్‌నాథ్ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గత నెలలో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ భేటీ అయ్యారు. ఆ ఒక్క సమావేశంతో ఇరుదేశాల నడుమ గత నాలుగున్నర ఏళ్లుగా నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనకు పరిష్కారం లభించింది.

Advertisement

Next Story

Most Viewed