- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం...మా స్థలంలోనే ఆడుకుంటారా....
దిశ,సత్తుపల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఖాళీ స్థలంలో ఆడుకుంటున్న ఓ బాలుడిని స్థల యజమాని భార్యతో కలిసి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. వీఎం బంజర్ లోని జంగాల కాలనీలో ఓ ఖాళీ స్థలంలో కొందరు పిల్లలు కబడ్డీ ఆడుతున్నారు. దీన్ని గమనించిన స్థల యజమాని పచ్చిగడ్డి పాడుచేస్తున్నారు అంటూ భార్యతో కలిసి కేకలు వేస్తూ కర్రలు పట్టుకుని అక్కడికి రావటంతో భయపడిన పిల్లలు పారిపోయారు.
అయితే జాషువా అనే బాలుడు వారికి దొరకటంతో అతడిని విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మర్మాంగాలపై గాయాలు అవటంతో ముందుగా పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తరువాత తిరువూరులోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన సర్వ్యయ్య, నాగమణి దంపతులపై బాలుడి కుటుంబ సభ్యులు పోలీసుకు ఫిర్యాదు చేశారు.