బిగ్ బ్రేకింగ్.. హైదరాబాద్ లో ఐటీ సోదాలు

by Y.Nagarani |   ( Updated:2024-10-17 05:46:40.0  )
బిగ్ బ్రేకింగ్.. హైదరాబాద్ లో ఐటీ సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్/శేరిలింగంపల్లి: హైదరాబాద్ నగరంలో ఐటీ అధికారులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఐటీ అధికారులు తాజాగా రంగంలోకి దిగారు. కొల్లూరు, రాయదుర్గంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం ఉదయం రాయదుర్గంలోని గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ అధినేత అచ్యుత్ రావు ఇంట్లో, బొప్పన శ్రీనివాస్, బొప్పన అనూప్ ఇళ్లలో సోదాలు చేపట్టారు. అలాగే ఆయన కంపెనీలో పనిచేసే కీలక ఉద్యోగులు, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. కొల్లూరు ప్రాజెక్ట్ ఆఫీసులో, రాయదుర్గంలోని అచ్యుతరావు నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని 30 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ ఐటీ దాడులపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed