Gandhi Bhavan: గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన.. టీపీసీసీ చీఫ్ సంచలన నిర్ణయం!

by Prasad Jukanti |   ( Updated:2024-10-17 07:31:12.0  )
Gandhi Bhavan: గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన.. టీపీసీసీ చీఫ్ సంచలన నిర్ణయం!
X

దిశ, తెలంగాణ/ డైనమిక్ బ్యూరో: ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తున్న వేళ వాయిదా వేయాలంటూ అభ్యర్థులు మరోసారి రోడ్డెక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించకుండా పరీక్ష నిర్వహించవద్దని గత రాత్రి అశోక్‌నగర్ వద్ద అభ్యర్థులు ఆందోళన చేపట్టగా ఇవాళ ఉదయం గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అభ్యర్థులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అభ్యర్థుల బృందంతో మాట్లాడాలని నిర్ణయించారు. కాసేపట్లో వారితో సమావేశం కానున్నారు. అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టాలని పోలీసులను పీసీసీ చీఫ్ ఆదేశించారు. మరోవైపు కొంతమంది గ్రూప్-1 అభ్యర్థులు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. మెయిన్స్ పరీక్షను వాయిదా వేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

పరీక్ష నిర్వహణపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి 27 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ పరీక్షల నిర్వహణపై ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు.

Advertisement

Next Story