- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Coast Guard: అండమాన్ జలాల్లో ఐదు టన్నుల డ్రగ్స్.. సీజ్ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్ !
దిశ, నేషనల్ బ్యూరో: అండమాన్ జలాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఫిషింగ్ బోట్లలో సుమారు ఐదు టన్నుల డ్రగ్స్ తరలిస్తుండగా ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) స్వాధీనం చేసుకున్నట్టు రక్షణ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. ఇప్పటి వరకు ఐసీజీ పట్టుకున్న డ్రగ్స్‌లో ఇదే అతి పెద్దదిగా భావిస్తున్నారు. సాధారణ పెట్రోలింగ్ సమయంలో పోర్ట్ బ్లెయిర్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని బారెన్ ఐలాండ్ సమీపంలోని ఓ బోటులో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించిన అధికారులు బోటులో తనిఖీలు చేపట్టి డ్రగ్స్ పట్టుకున్నట్టు తెలుస్తోంది. బోటులో ఆరుగురు మయన్మార్ పౌరులు కూడా ఉన్నట్టు సమాచారం. అయితే ఏ రకమైన డ్రగ్స్ సీజ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వాటి విలువ ఎంత ఉంటుంది అనే విషయాలను వెల్లడించలేదు. అంతకుముందు ఈనెల15న గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరంలో 500 కిలోల డ్రగ్స్‌ను ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఏటీఎస్ స్వాధీనం చేసుకున్నాయి.