ప్రజావాణికి తరలిన స్కూల్ విద్యార్థులు...

by Sumithra |
ప్రజావాణికి తరలిన స్కూల్ విద్యార్థులు...
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : మధ్యాహ్నం భోజనం సరిగా పెట్టడం లేదని స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ప్రజావాణికి వచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరెపల్లి పాఠశాల విద్యార్థులు పేరెంట్స్ తో సహా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అనంతరం జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారి పై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినిలు మాట్లాడుతూ తమకు పురుగులు పట్టిన బియ్యం నాసిరకమైన కూరగాయలతో భోజనం పెడుతున్నట్లు ఆరోపించారు. చాలిచాలకుండా బోజనం పెట్టడంతో విద్యార్థులు అర్థాకలితో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంట మనిషిని మార్చి మరో వంట మనిషిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. విద్యార్థులు ధర్నా చేయడంతో జగిత్యాల - కరీంనగర్‌ రహదారి పై కొద్ది సేపు వాహనాలు నిలిచిపోయాయి.

Advertisement

Next Story

Most Viewed