- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Waqf Land : ప్రైవేటు స్థలంలో ఇంటి నిర్మాణం.. వక్ఫ్ ఆస్తి అంటూ ఘర్షణ.. జాలేసర్‌లో ఉద్రిక్తత
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని ఈటా(Etah) జిల్లా జాలేసర్(Jalesar)లో ఉద్రిక్తత ఏర్పడింది. పట్టణంలోని ఒక దర్గాకు సమీపంలో ఉన్న ప్రైవేటు స్థలంలో ఇంటిని నిర్మిస్తున్న అనిల్ కుమార్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తిపై రఫీక్, ఫర్మాన్ అనే ఇద్దరు యువకులు దాడికి దిగారు. ఆ స్థలం దర్గాది, వక్ఫ్ ఆస్తి(Waqf land) అంటూ రఫీక్, ఫర్మాన్ వాదించారు. ఈ గొడవ జరుగుతుండగా ఓ వర్గానికి చెందిన వారు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అనిల్ కుమార్ ఉపాధ్యాయ్ నిర్మించిన సరిహద్దు గోడను కూల్చేశారు. అక్కడున్న డజన్ల కొద్దీ వాహనాలను ధ్వంసం చేశారు. అనిల్ కుమార్, అతడి సంబంధీకులపైకి రాళ్లు విసిరారు. పోలీసులు అక్కడికి చేరుకొని అల్లరి మూకలను చెదరగొట్టారు.
ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. సోమవారం ఉదయం కీలక నిందితులు రఫీక్, ఫర్మాన్‌లను అరెస్టు చేశారు. 16 మంది అనుమానితులు, 150 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అనిల్ కుమార్ ఉపాధ్యాయ్ గొంతును నులమడం ద్వారా రఫీక్ హత్యాయత్నం చేశాడని పోలీసులు ఆరోపించారు. ఈ వివాదానికి కారణమైన ప్రైవేటు స్థలం రెవెన్యూ రికార్డుల ప్రకారం అనిల్ కుమార్‌దే అని తేలిందన్నారు. ఈ ఘటన నేపథ్యంలో సోమవారం జాలేసర్ పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు.