Ambedkar University: అంబేద్కర్ వర్సిటీలో వంటావార్పు వాయిదా.. ఎమ్మెల్సీ కోదండరాం విజ్ఞప్తి మేరకు వెనక్కి తగ్గిన జేఏసీ

by Maddikunta Saikiran |
Ambedkar University: అంబేద్కర్ వర్సిటీలో వంటావార్పు వాయిదా.. ఎమ్మెల్సీ కోదండరాం విజ్ఞప్తి మేరకు వెనక్కి తగ్గిన జేఏసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ వర్సిటీలో(Ambedkar University) ఈనెల 27వ తేదీన చేపట్టాలని పిలుపునిచ్చిన వంటావార్పు కార్యక్రమాన్ని(Cooking program) వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఎమ్మెల్సీ కోదండరాం(MLC Kodandaram) విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు జేఏసీ చైర్‌పర్సన్(JAC Chairperson) పల్లవి కాబ్డే(Pallavi Kabde) తెలిపారు. అంబేద్కర్ వర్సిటీకి చెందిన 10 ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి(JNAFAV) కేటాయించాలనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వర్సిటీలో సోమవారం నిరసనలు వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా పల్లవీ కాబ్డే మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నానని, దానికి మరికొంత సమయం అవసరమని, ఎమ్మెల్సీ కోదండరాం చెప్పారని, అందుకే వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెక్రటరీ జనరల్ డాక్టర్ పీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ఏమాత్రం భావ్యం కాదని పేర్కొన్నారు. కోదండరాం హామీ మేరకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. నిరసనలో జేఏసీ నేతలు వెంకటేశ్వర్లు, యాకేశ్ దైద, ఉదయిని, హబీబుద్దీన్, కాంతం ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story