- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HDFC Insurance: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ డేటా లీక్.. అప్రమత్తమైన కంపెనీ
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రైవేట్ రంగ బీమా కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ డేటా లీక్ అయింది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించింది. డేటా లీక్‌కు సంబంధించి సమాచారం తమకు చేరిందని, ఎంత మేరకు ప్రభావం ఉంటుందనే దానిపై అంచనా వేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. 'కస్టమర్లకు సంబంధించి నిర్దిష్ట డేటా లీక్ అయిన విషయం గురించి గుర్తుతెలియని వారి నుంచి తెలుసుకున్నాం. కంపెనీ సమాచార భద్రతపై అప్రమత్తం అయ్యామని, డేటాను విశ్లేషిస్తున్నట్టు' రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. డేటా లీక్ అయ్యేందుకు ప్రధాన కారణంతో పాటు అవసరమైన నివారణ చర్యలు తీసుకునేందుకు సంబంధిత నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ, దర్యాప్తు చేపట్టామని కంపెనీ స్పష్టం చేసింది. డేటా లీక్ ప్రభావం ఎంత ఉంటుందనే దానిపై కంపెనీ విడిగా పరిశీలిస్తోందని, కస్టమర్ల సమాచారాన్ని కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. కాగా, గత నెలలోనే పాలసీదారుల డేటాల్ ఈక్‌కు సంబంధించి బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ రెండు బీమా సంస్థలను ఐటీ సిస్టమ్‌ల ఆడిట్‌లను నిర్వహించాలని ఆదేశించింది. ఆ తర్వాత స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, టాటా ఏఐజీ కంపెనీలు డేటా లీక్‌ను ఎదుర్కొన్నామని పేర్కొన్నాయి.