- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICMR-NIOH: భారీ జీతంతో ఎన్ఐఓహెచ్ లో ఉద్యోగాలు.. డీటెయిల్స్ ఇవే..!
దిశ, వెబ్డెస్క్: గుజరాత్(Gujarath) రాష్ట్రం అహ్మదాబాద్(Ahmedabad)లోని ప్రభుత్వ రంగ సంస్థ ఐసీఎంఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్(ICMR-NIOH) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://nioh.org/ ద్వారా ఆన్లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 11 డిసెంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
- టెక్నీషియన్ - 19
- ల్యాబోరేటరీ అటెండెంట్ - 06
- అసిస్టెంట్ - 02
విద్యార్హత:
పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు పని అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి:
టెక్నీషియన్ పోస్టుకు 28 ఏళ్లు, ల్యాబోరేటరీ అటెండెంట్ పోస్టుకు 25 ఏళ్లు, అసిస్టెంట్ పోస్టుకు 30 ఏళ్లకు మించి ఉండకూడదు.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం:
టెక్నీషియన్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 19,000- 63,000; ల్యాబోరేటరీ అటెండెంట్ పోస్టుకు రూ. 18,000-56,000; అసిస్టెంట్ పోస్టుకు రూ. 35,000-1,12,000 జీతం ఉంటుంది.