అంబేద్కర్ మాటలను కాంగ్రెస్ అంతఃకరణశుద్ధితో ఆచరిస్తుంది: మంత్రి కొండా సురేఖ

by Mahesh |
అంబేద్కర్ మాటలను కాంగ్రెస్ అంతఃకరణశుద్ధితో ఆచరిస్తుంది: మంత్రి కొండా సురేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల కన్నా పాలకుల స్వీయ నైతికతే మన దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుందని అంబేద్కర్ మాటలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అంతఃకరణశుద్ధితో ఆచరిస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవంను పురస్కరించుకొని అందుకు రూపకల్పనకు సుదీర్ఘకాలం శ్రమించిన మేధావుల కృషిని స్మరించుకున్నారు. ఈ రోజు దేశ ప్రజలకు ప్రత్యేకమైనదని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాతంత్ర్యానంతరం దశ దిశ లేని భారత్ కు నూతన రాజ్యాంగంతో జవసత్వాలు సమకూరి, గొప్పగా పురోగమించిందని పేర్కొన్నారు. రాజ్యాంగం నేడు ప్రపంచంలోని శక్తివంతమైన రాజ్యాంగాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తితో మన రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలను గౌరవించుకుంటూ, ప్రగతిశీల, శాంతియుత భారతాన్ని ఆవిష్కరించు కునేందుకు ప్రజలంతా ఏకం కావాలని ఆకాంక్షించారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం, ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల వికాసానికై కాంగ్రెస్ ప్రభుత్వం ‘పనుల జాతర’ను నిర్వహిస్తున్నామని, రూ.2,750 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed