- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Adani Group: 28 నెలల పాటు రుణాలు చెల్లించేందుకు సరిపడా నిధులున్నాయి: అదానీ గ్రూప్
దిశ, బిజినెస్ బ్యూరో: సంస్థ వద్ద రూ. 53,024 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయని, గ్రూప్ లిక్విడిటీ మెరుగైన స్థితిలోనే ఉందని బిలీయనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ సోమవారం ప్రకటనలో వెల్లడించింది. ఈ మొత్తం ప్రస్తుత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి సంస్థ స్థూల రుణం రూ. 2,58,276 కోట్లలో 20.53 శాతానికి సమానమని కంపెనీ తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం క్రెడిట్ అప్‌డేట్ ప్రకారం.. గ్రూప్ ప్రస్తుత నగదు నిల్వలు సుమారు 28 నెలల పాటు రుణాలు చెల్లించేందుకు లిక్విడిటీ కవర్‌ను అందిస్తాయి. సంస్థకు చెందిన వార్షిక రుణ మెచ్యూరిటీలు 2033-34 వరకు ప్రస్తుత సెప్టెంబర్ ఆపరేటింగ్ నగదు ప్రవాహం కంటే తక్కువగానే ఉన్నాయని, కార్యకలాపాల నగదు ద్వారా రుణాలను చెల్లించగలమని స్పష్టం చేసింది. గ్రూప్ రుణ పోర్ట్‌ఫోలియోలో దేశీయ బ్యాంకుల నుంచి 42 శాతం, గ్లోబల్ బ్యాంకుల నుంచి 27 శాతం, గ్లోబల్ కేపిటల్ మార్కెట్ల నుంచి 23 శాతం, దేశీయ కేపిటల్ మార్కెట్ల నుంచి 5 శాతం, ఇతర డెట్ ఫైనాన్షింగ్ మార్గాల నుంచి 3 శాతం రుణాలు తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం నాటికి అదానీ గ్రూప్ మొత్తం ఆస్తుల విలువ రూ. 5.53 లక్షల కోట్లకు చేరాయని, ఇది గతేడాది కంటే రూ. 75,277 కోట్లు పెరిగినట్టు పేర్కొంది. కాగా, ఇటీవల గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, ఇతర ఆరుగురిపై అమెరికా కోర్టు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, వాటిని అదానీ గ్రూప్ ఖండించింది. అవి నిరాధారమని, దానిపై చట్టపరంగా ముందుకెళ్లనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజా గణాంకాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాల కారణంగా సోమవారం నాటీకి అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో రూ. 10,458 కోట్లను కోల్పోయింది.