- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
EVMs : బ్యాలట్ పేపర్ల కాలానికి వెళ్లిపోదాం.. ఈవీఎంలు హ్యాక్ కావొచ్చు : సీఎం సుఖు
దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(EVMs)పై హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు(Sukhvinder Sukhu) కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిని హ్యాక్ చేయొచ్చనే ప్రచారం జరుగుతున్నందున.. ఆ సందేహాలను తీర్చేందుకైనా బ్యాలట్ పేపర్ల(ballot papers)తో ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం సుఖ్విందర్ ఈ కామెంట్స్ చేశారు. ‘‘ఈవీఎంల తయారీదారులు వాటి ఉత్పత్తిని ఇప్పటికే ఆపేశారు. ఒకవేళ వాటి పనితీరుపై ఎవరైనా సందేహాలను వ్యక్తం చేస్తే.. బ్యాలట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి. ఈ అంశంపై పెద్దసంఖ్యలో ప్రజల నుంచి డిమాండ్లు వస్తే పరిగణనలోకి తీసుకోవాలి’’ అని ఆయన కోరారు.
‘‘ఏ టెక్నాలజీని అయినా హ్యాక్ చేయొచ్చని.. ఎలాన్ మస్క్ కూడా చెబుతున్నాడు’’ అని సీఎం సుఖు గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేత జైరాం ఠాకూర్ ఖండించారు. ‘‘ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలే ఓడించారు. ఈవీఎంలు ఓడించలేదు. ప్రజా వ్యతిరేక వైఖరి ఉన్నందు వల్లే కాంగ్రెస్ ఓడిపోతోంది’’ అని ఆయన సీఎం సుఖును ఎద్దేవా చేశారు.