Doctors Association: సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ హర్షణీయం: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం

by Maddikunta Saikiran |
Doctors Association: సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ హర్షణీయం: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం
X

దిశ; తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజారోగ్య వైద్యుల భర్తీ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం(Doctors Association) పేర్కొంది. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM. Revanth Reddy), ఆరోగ్య శాఖ మంత్రి(Health Minister) దామోదర రాజనరసింహ(Damodara Rajanarasimha)లకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ వైద్యుల రాష్ట అధ్యక్షులు డాక్టర్ నరహరి, రాష్ట్ర సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ రవూఫ్ లు సోమవారం మాట్లాడుతూ..పేద ప్రజల ఆరోగ్యాలను కాపాడటంలో ప్రభుత్వ వైద్యులు పోటీ పడాలన్నారు. వైద్యచరిత్రలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, టెక్నాలజీ వాడుతూనే పేషెంట్లకు క్వాలిటీ వైద్యం అందించాలన్నారు. ఆరోగ్య రాష్ట్రంగా తెలంగాణను మార్చాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , డాక్టర్ జ్యోతి , డాక్టర్ బుస్రా డాక్టర్ విద్యాసాగర్ , డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ మురళీ డాక్టర్ రాజశేఖర్ , డాక్టర్ రమేష్ , డాక్టర్ దివ్య, డాక్టర్ శిరీషా, నూతనంగా నియామకం అయిన వైద్యులు, సెంట్రల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed