- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామపంచాయతీకి తాళం వేసిన కాంట్రాక్టర్...
దిశ, గంభీరావుపేట : పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీ భవనానికి కాంట్రాక్టర్ కేశవరావు సోమవారం తాళం వేసి, పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ కేశవరావు మాట్లాడుతూ గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ ఆవరణలో 25 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్, మరుగుదొడ్ల నిర్మాణం చేశానని అన్నారు. 12 లక్షల బిల్లులు ఇచ్చారని, ఇంకా 13 లక్షల బిల్లు పెండింగ్ లో ఉన్నాయని, అయినా మంత్రి పొన్నం ప్రభాకర్ చేత షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించామని అన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు నిధులు లేకపోవడంతో బిల్లులు రాలేవని, అది కాంట్రాక్టర్ గా అర్థం చేసుకున్నానని అన్నారు. ఐదు నెలల క్రితం గ్రామపంచాయతీకి ఎస్ఎఫ్ఎస్ నిధుల నుండి 10 లక్షలు జామ అయ్యాయని, మండలంలో నలుగురు కాంట్రాక్టర్లు ఉన్నామని మనిషికి కొంత ఇవ్వాలని డీపీఓ, జీపీ స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో రాజేందర్ రెడ్డికు వినతి పత్రాలు ఇచ్చామని అన్నారు.
స్పెషలాఫీసర్ రాజేందర్ రెడ్డి ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తానని మూడు రోజులు కాలయాపన చేశారని అన్నారు. మూడు రోజుల్లోపే ముగ్గురు కాంట్రాక్టర్ల వద్ద మనిషికి తల 50 వేల రూపాయలు లంచం తీసుకొని, బిల్లులను మంజూరు చేశాడని ఆరోపించారు. తన బిల్లులు ఇవ్వాలని అడిగితే నీకు ఇవ్వ అని చెప్పడంతో గ్రామపంచాయతీలో అవినీతి జరిగిందని కలెక్టర్కు ఫిర్యాదు చేశానని అన్నారు. కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతో డీఎల్పీఓను ఎంక్వయిరీ ఆదేశించారని, డీఎల్పీఓ ఇచ్చిన ఎంక్వయిరీ రిపోర్టులో తన పెండింగ్ బిల్లులు 13 లక్షలు ఉన్నాయని, ఏ నిధులు అందుబాటులో ఉంటే ఆ నిధుల నుండి బిల్లులను మంజూరు చేయాలని ఎంక్వయిరీ రిపోర్టులో ఇచ్చాడని అన్నారు. ఎంక్వైరీ రిపోర్టు వచ్చి 14 రోజులు కావస్తున్నా బిల్లులు ఇవ్వడం లేదని, స్పెషలాఫీసర్, ఈవోను అడుగుతే మా మీదనే కంప్లైంట్ చేస్తావా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని దాటీ వేస్తున్నారని అన్నారు. గంభీరావు పేట గ్రామపంచాయతీలో జనరల్ ఫండ్ లో 15 లక్షలు రెండు నెలల నుంచి ఉన్నాయని, వాటి నుండి బిల్లులను ఇవ్వక స్పెషల్ ఆఫీసర్ రాజేందర్ రెడ్డి, ఈవో ఇబ్బందుల గురి చేస్తున్నారని ఆరోపించారు. బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో శతమాతమవుతున్నారని, వెంటనే బిల్లులు ఇవ్వాలని లేకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు.