- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏజెన్సీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి: రాజేశ్ నాయక్
దిశ, తెలంగాణ బ్యూరో : జనరల్ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ వల్ల ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారికి కూడా ఏజెన్సీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డిని కలిశారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం తక్షణమే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం చేసి వంద శాతం రిజర్వేషన్లు అక్కడ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటనలో ఆర్టికల్ 244(1)ను అనుసరించి ఏజెన్సీ ప్రాంతాల్లో 100 శాతం ఉద్యోగాలను స్థానిక గిరిజన అభ్యర్ధులతోనే భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ డీఎస్సీ, జనరల్ డీఎస్సీకి రెండుగా నోటిఫికేషన్లను ప్రకటించాలన్నారు. షెడ్యూల్డ్ ఏరియాలో షెడ్యూల్డ్ ట్రైబ్ లకు మాత్రమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మెగా డీఎస్సీలో గిరిజనులు నష్టపోకుండా చూడాలని డిమాండ్ చేశారు.