సందడిగా సదర్​ ఉత్సవాలు..ప్రత్యేక ఆకర్షణగా దున్నపోతు ప్రదర్శన

by Naveena |   ( Updated:2024-11-25 16:58:01.0  )
సందడిగా సదర్​ ఉత్సవాలు..ప్రత్యేక ఆకర్షణగా దున్నపోతు ప్రదర్శన
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట జిల్లా చరిత్రలో మొదటిసారిగా సదర్ సయ్యాట ఉత్సవం సోమవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా దున్నపోతుల ప్రదర్శనలు చూపర్లను ఎంతో ఆకట్టుకున్నాయి. డప్పు దరువులతో...యాదవుల పాటలతో..యువత నృత్యాలతో పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలోని భారంబావి నుంచి పాత బస్టాండ్ వరకు యాదవులు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీని చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. సదర్ అంటేనే నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుడిని తయారు చేయడం అని పేర్కొన్నారు. అలాగే యాదవుల గొప్పతనాన్ని గురించి ,యాదవ జాతి గురించి మాట్లాడారు. పేటలో యాదవ భవన్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే కృషి చేయాలని కోరారు. సదర్ ఉత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకలో భారీ దున్నపోతును ప్రదర్శన కోసం ప్రత్యేకంగా తెప్పించారు. ఈ దున్నపోతును చూసేందుకు జనం ఎంతో ఉత్సాహం కనబరిచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, మునిసిపల్ ఛైర్ పర్సన్ అనసూయ, భీష్మ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ హరి నారాయణ్ భట్టడ్, మార్కెట్ ఛైర్మెన్ సదా శివారెడ్డి, డిసిసి మాజీ అధ్యక్షులు కె .శివకుమార్ రెడ్డి, నాగురావు నామాజీ, ఆర్డీవో రామచందర్, సదర్ ఆహ్వాన కమిటీ అధ్యక్షులు గొల్ల బాలప్ప యాదవ్, కొండా సత్యా యాదవ్, గొల్ల రవి తేజ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed